ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

27-09-2026 | 02:49pm

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు

కోరుట్ల/జగిత్యాల, సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ చేతన్ నితిన్, ఐపీఎస్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

తెలంగాణ సమాజం కోసం ఆయన చేసిన సేవలు, ప్రజా సమస్యలపై ఆయన సాగించిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్‌ఐ వేణుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు.


మరిన్ని వార్తలు