దళిత యువకుడిపై దాడి

27-09-2026 | 02:37pm

ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు....

సుల్తానాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): దళిత యువకుడి పై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఒక హోల్సేల్ దుకాణంలో పనిచేసే చిలుక ఉదయ్ అనే యువకుడిపై దాడి చేసిన ఘటనలో మునిగంటి రంజిత్, మునిగంటి శ్రావణ్, గోపిడి ఓంకార్ అనే ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్(SI Chandrakumar) తెలిపారు.

పట్టణంలోని పూసల రోడ్డులో నివాసం ఉండే ఉదయ్ ను కారులో బలవంతంగా ఎక్కించక పోయి నీరుకుల్లా గ్రామ శివారు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కర్రలతో విపరీతంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారని, సమాచారం అందుకున్న ఉదయ్ సోదరుడు శ్రీకాంత్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగిందని, మరో కొందరిపై కేసు నమోదు చేయాల్సి ఉందని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు..

మరిన్ని వార్తలు