బిజెవైఎమ్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

27-09-2026 | 02:56pm

ముకరంపుర, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas), బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే పరమావధిగా అహర్నిశలు శ్రమిస్తూ, 25 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ మార్గనిర్దేశనంలో దేశం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని కొనియాడారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే రక్తదానం అత్యంత పవిత్రమైన కార్యక్రమం అని, ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెవైఎమ్ కరీంనగర్ ప్రతినిధులను, కార్యకర్తలను అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు, బిజెవైఎమ్ నాయకులు మరియు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.

మరిన్ని వార్తలు