శాలగుండ్లపల్లిలో విషాదం

27-11-2026 | 09:19am
  1. అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
  2. భర్త, అత్తింటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు
  3. శాలగుండ్లపల్లి లో గోదావరిఖని  ఏసీపీ మడత రమేష్

ముత్తారం, నవంబర్ 27(విజయక్రాంతి): అదనపు కట్నం(Dowry Harassment) వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ముత్తారం మండలంలో( Muttharam mandal) చోటుచేసుకుంది. ముత్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శాలగుండ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. గోదావరిఖని ఏసిపి మడత రమేష్ కథన ప్రకారం శాలగుండ్లపల్లికి చెందిన బత్తుల సంతోష్ యాదవ్ భార్య నేతెట్ల అలియాస్ బత్తుల రజిత (మృతురాలు)ను అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామ, బావ, తోటి కోడలు వేధిస్తున్నారని మృతురాలి తండ్రి నేతెట్ల బాపు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వేధింపుల కారణంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్న రజిత అత్తగారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త బత్తుల సంతోష్, అత్త బత్తుల పార్వతమ్మ, మామ బత్తుల ఓదెలు, బావ బత్తుల రవి, తోటి కోడలు బత్తుల సంధ్యపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ముత్తారం తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించగా, గోదావరిఖని ఏసీపీ కేసు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు