ఖర్గే సంచలన డిమాండ్.. సీఈసీని తొలగించాల్సిందే!
ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘ఓట్ బచావ్.. దేశ్ బచావ్’ నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాంలీలా మైదాన్‌లో జరిగిన ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో పాటు పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు (Opposition Rally). ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు
ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించారనేది విపక్ష కూటమి ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చుతూ, అనర్హమైన, నకిలీ నమోదులను తొలగించడమే సవరణ ఉద్దేశమని చెబుతోంది (Voter List Revision).
ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా ఈ పోరాటం చేపట్టినట్లు ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. రాంలీలా మైదాన్ వేదికగా విపక్ష నేతలు చేసిన ప్రసంగాలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి (Save the Vote).