భారతీయులకు బంపర్ ఆఫర్

25-09-2026 | 01:39pm

భారతీయుల కోసం అర్జెంటీనా(Argentina Visa for Indians) కొత్త గేట్లు తెరిచింది. టూరిజం, బిజినెస్, పెట్టుబడుల విషయంలో భారతీయులను ఆకర్షించేలా అర్జెంటీనా పలు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా చెల్లుబాటయ్యే B1/B2, B2, J, B1, O, P, E, H-1B వంటి నిర్దిష్ట అమెరికా వీసాలు(Argentina Visa Free for Indians) లేదా Green Card ఉన్న భారతీయులు పర్యాటక ప్రయోజనాల కోసం అర్జెంటీనాలోకి అర్జెంటీనా టూరిస్ట్ వీసా లేకుండానే గరిష్ఠంగా 90(Argentina 90 Days Visa) రోజుల వరకు ప్రవేశించవచ్చు. ఈ నిబంధన 2025 ఆగస్టు 28 నుంచి అమల్లో ఉంది. ఇక భారతీయుల కోసం ఐదేళ్ల దీర్ఘకాలిక బిజినెస్ వీసా(Business Visa) ఉచితంగా అందుబాటులో ఉందని అర్జెంటీనా రాయబార కార్యాలయం పేర్కొంది. మరోవైపు రిమోట్‌గా పనిచేసే వారికి డిజిటల్ నొమాడ్ వీసా వంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భారత్–అర్జెంటీనా మధ్య ప్రయాణాలు, వ్యాపారం, పెట్టుబడులకు మరింత ఊతమిచ్చేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

భారత్ ప్రస్తుతం అర్జెంటీనాకు కీలక వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా ఎదిగింది. 2025లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 6.5 బిలియన్ డాలర్లకు పైగా నమోదైంది. ముఖ్యంగా ఇంధనం, ఆహార భద్రత వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారం వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యాటక రంగం(Argentina Business Visa Indians) కూడా భారత్-అర్జెంటీనా సంబంధాలను(India-Argentina relations) మరింత దగ్గర చేసే అవకాశముందని అర్జెంటీనా రాయబారి పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు పెరగడం ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక పరస్పర సంబంధాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు