ఉదయ సముద్రం కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

30-10-2026 | 10:26pm

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

చిట్యాల, అక్టోబర్ 30(విజయ క్రాంతి ): బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutta Sukender Reddy) అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో కాలువ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఈ, డీఈ, ఈఈ, ఎస్ఈ తదితర అధికారులను పనుల ప్రస్తుత స్థితిగతులు, ఇప్పటివరకు సాధించిన పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా కాలువ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు