17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని బీజేపీ వినతి

11-09-2026 | 05:22pm

దామరచర్ల : సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day)గా నిర్వహించాలని కోరుతూ బీజేపీ దామరచర్ల మండల శాఖ ఆధ్వర్యంలో దామరచర్ల తహసీల్దార్ కి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్మంత రెడ్డి(Kisan Morcha State Treasurer Kanmantha Reddy) అశోక్ రెడ్డి  మాట్లాడుతూ నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలననుండి విముక్తి పొందిన సెప్టెంబర్ 17 నే తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవంగా నిర్వహించలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేష్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జానకిరామ్ రెడ్డి, విజయ్, జిల్లా నాయకులు ఈగ సైదరావు, శ్రీనివాస్ రెడ్డి, పెండెం సైదులు, సేవ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు