ఆమనగల్లులో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు స్థలం పరిశీలన

24-10-2026 | 10:12pm

​ఆమనగల్లు, అక్టోబర్ 24(విజయక్రాంతి): ఆమనగల్లు పట్టణంలో నూతనంగా మంజూరైన  ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు(Traffic Police Station) సరైన కార్యాలయం కోసం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy) సీఐ శంకరయ్య తో కలిసి  స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్(Electricity Substation) సమీపంలో ఉన్న  పాత ఇరిగేషన్ ఆఫీస్ అయితే కార్యాలయం కనుగా ఉంటుందని వారు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.​

పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు, ప్రమాదాల నివారణకు(Prevention of Accidents) ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థలాన్ని ఖరారు చేయడంపై స్థానిక ప్రజలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శివలింగం, కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్, నాయకులు మల్లయ్య, శేఖర్, సత్యం, ప్రసాద్, అలీం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు