గోపాలస్వామి గుడి భూములను పరిరక్షించాలి
సుల్తానాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని అతి పురాతన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ భూముల(Venugopalaswamy Temple Lands)ను పరిరక్షించాలని మాజీ ఎంపీపీ సమిండ్ల శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల రవీందర్ గౌడ్, సోమవారం తహసీల్దార్ బషీరొద్దీన్ నుకు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్యాక్రాంతమైన కొందరు అక్రమంగా అమ్ముకున్న వేణుగోపాలస్వామి గుడి భూములను గుర్తించి స్వాధీనం పరచాలని కోరారు. ఆలయ భూములకు హద్దులు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల రవీందర్ గౌడ్, కన్న రమేశ్ గౌడ్, మాదాసు అంజన్న పటేల్ తదితరులున్నారు.