కండక్టర్‌ను నెట్టివేసిన మహిళ అరెస్టు
26-10-2026 | 07:24pm
అశ్వాపురం, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు(RTC Bus)లో టికెట్ విషయంలో జరిగిన గొడవలో మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి నెట్టివేసిన ఘటనకు సంబంధించి బానోత్ మౌనికను సోమవారం అరెస్టు చేసినట్లు అశ్వాపురం సీఐ తెలిపారు. ఆదివారం టికెట్ విషయమై కండక్టర్‌తో వాగ్వాదానికి దిగిన నిందితురాలు ఆమెను బస్సు నుంచి నెట్టివేయడంతో రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో బస్సు ఆమె కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి మణుగూరు కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ వెల్లడించారు.