ఎస్సీ సామాజిక భవనం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం
బోయినపల్లి: నవంబర్ 3 ( విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గం వారు కోరెం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం(SC Community Building) కావాలని కోరుతూ చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ మేడిపల్లి సత్యం(MLA Dr. Sri Medipalli Satyam) కు వినతి పత్రాన్ని మంగళవారం ఆయన నివాసంలో అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం సానుకూలంగా స్పందించి త్వరలోనే ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కెనపల్లి ఉపేందర్. కాంగ్రెస్ నాయకులు కొలుపుల ప్రవీణ్. కోరెం గ్రామ ఎస్సీ కుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.