పెనుగోలు భూములకు పట్టాలు ఇవ్వాలి
- అదనపు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన
- ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి
- వందల ఏళ్లుగా పట్టించుకోని ప్రభుత్వాలు..
వెంకటాపురం నూగూరు నవంబర్ 3 విజయ క్రాంతి: వందల ఏళ్లుగా అడవులను కొండ లను నమ్ముకొని బ్రతుకుతున్న పెనుగోలు ఆదివాసీల సాగు భూములు ప్రాజెక్ట్ ల(Penugol tribal cultivation lands projects) పేరుతో తీసుకోవద్దని పెనుగోలు ఆదివాసీలు ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆధ్వర్యంలో ములుగు అదనపు జిల్లా కలెక్టర్ మహేందర్ జీ ని(Additional District Collector Mahender G) కలిసి వినతిపత్రం అందజేసినట్టు మీడియకు తెలిపారు.
మంగళవారం ములుగు కలెక్ట్రెట్ లో కలిసినట్టు నర్సింహా మూర్తి తెలిపారు. రెవిన్యూ అధికారులు పెసా గ్రామసభలను, 1/59, 1/70, అటవీ హక్కుల గుర్తింపు చట్టాలను గౌరవించకుండా తమ ఇష్టాను సారంగా మోడీ కుంట ప్రాజెక్ట్ కు భూములు ఇస్తున్నట్టు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వందల ఏళ్లుగా పెనుగోలు ఆదివాసీలు ఎటువంటి ప్రభుత్వ సేవలకు నోచుకోలేదని ఆయన అన్నారు.
విద్య, వైద్య సేవలు పొండలేదని అన్నారు. పామునూరు, జెల్లా, డోలి, తడపల, చెలిమల, ముకునూరు గ్రామాలకు అక్కడ ప్రజలు లేకున్నా కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు వేసిన ప్రభుత్వం పెనుగోలు గ్రామం లో ప్రజలు ఉన్నప్పటికీ రోడ్డు ఎందుకు వేయడం లేదని ఆయన అదనపు కలెక్టర్ ని ప్రశ్నించినట్టు తెలియజేసారు . కర్రేగుట్టలకు రోడ్డు వేయడానికి ఎటువంటి అంక్షలు పెట్టని అటవీ శాఖ పెనుగోలు గ్రామానికి రోడ్డు వేయడానికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని అన్నారు.
ఐదో పంచవర్షిక ప్రణాళికలో ఆదివాసీలు ఎక్కడ ఉంటే అక్కడే వాళ్ళను అభివృద్ధి చేయాలనీ అడవి నుండి బయటకు తెచ్చి నిర్వాసితులను చేయొద్దని చెప్పినట్టు గుర్తు చేశారు. వందల ఏళ్లుగా పెనుగోలు గ్రామానికి ప్రభుత్వ సేవలు అందలేదన్నారు. ఏనాడూ పెనుగోలు గ్రామాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్ళ భూములను మోడీకుంట ప్రాజెక్ట్ కు అప్పగించడానికి ప్రయత్నించడం సరికాదన్నారు.
పెనుగోలు గ్రామానికి పట్టాలు ఇచ్చే విధంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏ ఎన్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్, ఏ ఎన్ ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర అధికార ప్రతినిధి పాయం అజయ్, పాయం కృష్ణమూర్తి, బొగ్గుల నారాయణ, శివాజీ, ఉయిక సురేష్, రాజేష్ గోపాల్ తదితర రైతులు పాల్గొన్నారు..