ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, బెల్లంపల్లి కోర్టు కమిటీల ఎన్నిక..

03-11-2026 | 05:24pm

బెల్లంపల్లి: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(All India Lawyers Union), బెల్లంపల్లి కోర్టు కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా న్యాయవాది మాసు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా మురళి శ్రావణ్ ఎన్నికయ్యారు. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షులుగా జాడి రాజేష్, దేవరాజ్, సహాయ కార్యదర్శులుగా అనిల్ కుమార్, జూబేర్, కోశాధికారిగా కుమార్, కమిటీ సభ్యులుగా గొర్లపల్లి రమేష్, సజ్జనపు సంతోష్, కందుల సందీప్, బుర్సా రమేష్, దాట్లా సతీష్, మద్దిబోయిన శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా సీనియర్ న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల ఏమాజి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సబ్బాని సాయికుమార్ వ్యవహరించారు. 

- మహిళా కమిటీ అధ్యక్షురాలిగా సౌమ్య 

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బెల్లంపల్లి కోర్టు మహిళా కమిటీ కన్వీనర్ గా తౌటం సౌమ్య, కో కన్వీనర్లుగా పీక మమత, అరకొండ లావణ్య, దుర్గం గౌతమి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులు గా ఉమారాణి, స్వర్ణలత ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి కొయ్యల ఏమాజి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్నికైన నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు