అండర్ పాస్, డ్రైనేజీ నిర్మాణానికి హామీ

03-11-2026 | 05:34pm

మానకొండూరు, నవంబర్ 3 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామాన్ని మంగళవారం నేషనల్ హైవే (563) ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్(Project Director Bharadwaj) సందర్శించారు. శ్రీనివాస్ నగర్ గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు అండర్ పాస్, సైడ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, అధికారులకు, గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ మేకలమహేందర్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించారు.

ప్రజాప్రతినిధులు, నేషనల్ హైవే అధికారులకు ఈ విషయంపై సిఫారసు చేయగా నేషనల్ హైవే పీ డీ భరద్వాజ్ క్షేత్రస్థాయిలోపరిశీలించి, అండర్ పాస్, డ్రైనేజీ  సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు