వృద్ధాప్యంలో ఆహ్లాదంగా, సంతోషంగా ఉండాలి

04-11-2026 | 06:43pm

న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి నిహారిక 

బిజినేపల్లి, నవంబర్ 04 : - జీవితంలో వృద్ధాప్య దశ(Old age stage) అనేది చివరి దశ కాబట్టి అందరూ ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఉండాలని న్యాయ సేవ అధికార సంస్థ(Legal Services Authority) జిల్లా కార్యదర్శి నిహారిక  అన్నారు. వారికి ఏమైనా సహాయం కావాలంటే తమ సంస్థ తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర హైకోర్టు(State High Court) ఆదేశానుసారం నాగరుకర్నూల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో తేదీ బుధవారం మండల కేంద్రంలోని లూర్ధునగరు కాలనీ వృద్ధాశ్రమాని సందర్షించారు.

ఈ సందర్భంగా వారి యోగ క్షేమాలను తెలుసుకొని, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అడిగి, వారికి పండ్లు   పంపిణీ చేశారు. అనంతరం సంస్థ జిల్లా కార్యదర్శి నిహారిక మాట్లాడుతూ.. వృద్యాపంలో ఉన్న తల్లితండ్రులు భారం కాకూడదని, వారిని చిన్న పిల్లలతో సమానంగా ఒక బాధ్యతగా  చూసుకోవాలన్నారు. వృద్ధాశ్రమాలు మన దేశ సంస్కృతి కాదని, వారికి ఇంటి వద్దనే తగిన ప్రాధాన్యత కల్పిస్తే వృద్ధాశ్రమాల సంఖ్య పెరగవన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీరామ్ ఆర్య, ఆశ్రమ నిర్వాహకురాలు సిస్టర్ రవికుమారి, వృద్ధులు ఉన్నారు.

మరిన్ని వార్తలు