ఎండిన వరి పంటల నష్టం వివరాల సేకరణ వేగవంతం చేయాలి
క్షేత్రస్థాయిలో పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు
చివ్వెంల, నవంబర్ 4 (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన వరి పంటల నష్టం వివరాల సేకరణను వేగవంతం చేసి, వాస్తవ పరిస్థితులను పారదర్శకంగా నమోదు చేయాలని మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు(Agricultural Officer D. Venkateshwarlu) అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు మండలంలోని వాల్యా తండా, తిరుమలగిరి గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) చేపడుతున్న పంట నష్టం వివరాల సేకరణను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎండిపోయిన వరి పంటల విస్తీర్ణం, ప్రభావిత రైతుల వివరాలను నమోదు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.