సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క..

24-11-2026 | 10:22pm

ములుగు, నవంబర్ 24 (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటును అందిస్తోందని తెలిపారు.

అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ, వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసినేపల్లి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు