ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా భరోస
వెంకటాపురంలో ప్రారంభం
వెంకటాపురం, నూగూరు నవంబర్ 23, (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) వెంకటాపురం మండలంలో సోమవారం ప్రారంభించారు. ఈ నెల 23 నుండి 28 వరకు దరఖాస్తు స్వీకరణ, ఆన్లైన్ ప్రక్రియ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంట్లో ఒక్కరికి జీవిత బీమా కల్పించడం. కావున కుటుంబంలో జీవితం భీమా తప్పకుండా చేసుకొని ధీమాగా ఉండలని కోరారు.కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రంజిత్ .బిల్ కలెక్టర్ సుధాకర్. టైపిస్టు అనూష .తాటి శ్రీను సుందర్ రావు.గ్రామస్తులు పాల్గొన్నారు.