రాజ్యాంగ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్..

23-11-2026 | 06:58pm

ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): రాజ్యాంగంలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) సూచించారు.

మాల, మాదిగ, నేతకాని, అనుబంధ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించనున్న 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించే వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్ చిత్రు, జేఏసీ నాయకులు రమేష్, ప్రజ్ఞా కుమార్, మేకల మల్లన్న, పాశం రాఘవేంద్ర, భీంరావు వాగ్మారే, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు