గ్రామంలో ఓపెన్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
23-11-2026 | 06:41pm
చేర్యాల, నవంబర్ 23: చేర్యాల మండలంలోని చిట్యాల గ్రామ ఎస్సీ కాలనీలో ఓపెన్ డ్రైనేజ్ కోసం గ్రామ సర్పంచ్ జానకి కృష్ణలీల స్వామి అద్వరంలో ఎంపీ నిధులనుంచి ఐదు లక్షల రూపాయలతో సోమవారం ఓపెన్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామం తరుపున ఎంపీ చామల కిరణ్ కుమార్(MP Chamala Kiran Kumar)కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జడల బాలనర్సు, మోకు మల్లారెడ్డి, శ్రీదర్, గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల రాజు, గ్రామ ఉప సర్పంచ్ కనకయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాగమణి, రేణుక, వార్డు సభ్యులు కోడారి రజిత కుమార్, కుమార్ లాజర్, నాగలక్ష్మి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.