జోనల్ కమిషనర్ రాధికగుప్తాకి వినతి

23-11-2026 | 06:52pm

ఘట్ కేసర్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఉప్పల్ జోన్ పరిధిలోని ఘట్ కేసర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ సోమవారం ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు జోనల్ కమిషనర్ రాధికగుప్తా(Zonal Commissioner Radhika Gupta)ని కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ద్వారా ఇంచార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఎండార్స్ చేసిన కాపీని ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి కి అందచేసినది జోనల్ కమిషనర్ కి సమర్పించి ఇట్టి అభివృద్ధి త్వరిత గతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్. మచ్చేందర్రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ కడపోళ్ల మల్లేష్, డీసీసీ మాజీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్, ప్రధాన కార్యదర్శి కందకట్ల మాధవ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ బొక్క సంజీవరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోక మల్లేష్, మాజీ వార్డు సభ్యులు వి.బి. వెంకట్ నారాయణ ముదిరాజ్, నాయకులు అందెల సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు