ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభించిన సర్పంచ్

23-11-2026 | 06:58pm

బెజ్జూర్ నవంబర్ 23 (విజయ క్రాంతి): బెజ్జూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా(Indiramma Family Life Insurance) కార్యక్రమాన్ని సర్పంచ్ దుర్గం సరోజ ,ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ ప్రారంభించారు.సర్పంచ్ మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించే 18-59 ఏళ్ల వరకు 5 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు..ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ఉద్దేశమని చెప్పారు..అర్హులందరూ పంచాయతీ,శిబిరాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వయస్సు ధృవీకరణకు ఆధార్ ప్రాతిపదిక తీసుకుంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సామల తిరుపతి,గుమ్ముల శ్రీనివాస్,జాకీర్ హుస్సేన్,రామడుగుల రమేష్,నాయకులు ప్రభాకర్,ఆపరేటర్ ఆజీస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు