పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
23-11-2026 | 06:55pm
ఆసిఫాబాద్, నవంబర్ 23: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించి పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ(Jadhav Ambaji) సూచించారు. సోమవారం కేరమెరి మండలం అనార్పల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల పరీక్షల సన్నద్ధతను పరిశీలించారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.