కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
తాడ్వాయి, నవంబర్ 23 (విజయక్రాంతి): రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తాడువాయి సింగిల్ విండో చైర్మన్ సంతాజీ గారి సుధాకర్ రావు(Single Window Chairman Sudhakar Rao inaugurated) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేయాలనే సంకల్పంతో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సన్నం రకం వరి ధాన్యానికి ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ చెల్లించి రైతులకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తూర్పు రాజేంద్రప్రసాద్, నాయకులు రజనీకాంత్, వరుణ్ రావు తదితరులు పాల్గొన్నారు.