వయోవృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరం

26-09-2026 | 04:50pm

ములుగు, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలో శనివారం వయోవృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని(Free Eye Medical Camp) నిర్వహించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం(International Day of Older Persons) సందర్భంగా అక్టోబర్ ఒకటిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ(Department of Welfare of Senior Citizens) ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం వయోవృద్ధులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేకర్ ప్రత్యేక ఏర్పాట్లతో వయోవృద్ధులకు కంటి పరీక్షలు(Eye examinations) నిర్వహించడంతో పాటు, కంటి సంబంధిత సమస్యలు ఉన్న వారికి అవసరమైన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వయోవృద్ధులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించబడగా, సుమారు 40 మంది వయోవృద్ధులు శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.

వయోవృద్ధుల ఆరోగ్యం, సంక్షేమం, వారి పట్ల సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఇ.పి. ప్రేమలత, కార్యాలయ సిబ్బంది నాగేంద్ర, గణేష్, ప్రణామ్ డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ చుంచు రమేష్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు