తొలి దశ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

27-09-2026 | 07:37pm

కొత్తపల్లి, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ స్వరాష్ట్ర సాధన(Telangana struggle for independence) కోసం ఉద్యమించిన తొలి దశ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి(Konda Laxman Bapuji's Birth Anniversary) సందర్బంగా హన్మకొండ(Hanumakonda) లోని హంటర్ రోడ్డు లో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్ వద్ద నెలకొల్పిన బాపూజీ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకుల తో కలిసి రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు(Poladi Ramarao) పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడిగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధన కోసం పదవులను సైతం త్యాగం చేసిన మహనీయుడు మలిదశ ఉద్యమానికి మార్గదర్శకుడిగా నిలిచిన గొప్ప నాయకుడని రామారావు అన్నారు. సమాజంలో సమానత్వం,స్వచ్ఛత,న్యాయం కోసం శ్రామికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన ఆశయాలను, స్ఫూర్తి ని మనమందరం కొనసాగిద్దాం అని పోలాడి రామారావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహ్మారెడ్డి, కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు,హన్మకొండ జిల్లా పద్మ శాలి సంఘం అధ్యక్షుడు బచ్చు ఆనందం ప్రధాన కార్యదర్శులు యేదాసు వెంకటేశ్వర్లు, డిబ్బి రమేష్, వరంగల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆకుల రవీందర్, ప్రధాన కార్యదర్శి గోరంటాల రాజు, కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి. వీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు