తల్లిని కోల్పోయిన పసిపాపకు ఆర్థిక సాయం... ఆవు దూడ

27-09-2026 | 07:43pm

* అభిమన్యు వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన డబ్బు పంపిణీ..

ఉట్నూర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఉట్నూర్ డివిజన్ పరిధిలోని గాదిగూడ మండలం హీరపూర్ గ్రామానికి చెందిన ఆత్రం కవిత పసిపాపకు జన్మనిచ్చి మూర్చ వ్యాధితో  పక్షం రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలిసిన అభిమన్యు వాట్సాప్ గ్రూప్(Abhimanyu WhatsApp Group) ఆర్గనైజర్ మెస్రం శేఖర్ వాట్సాప్ లో పసిపాప తల్లి మరణించడంతో అనాధగా మారిందని, పాలు లేక అల్లాడుతున్న విషయాన్ని అభిమన్యు గ్రూప్ వాట్సాప్ సభ్యులకు  వివరించారు. వాట్సాప్ గ్రూప్ లో సభ్యులుగా ఉన్న 1250 మంది సభ్యులు తమ వంతు సహాయంగా 82200 రూపాయలను విరాళంగా ఇచ్చారు.

విరలంగా ఇచ్చిన డబ్బులతో  45000 రూపాయలను పాప పేరుతో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. పాప పాల కోసం  27000 రూపాయలతో ఆవు దూడను కొనుగోలు చేసి పాప బంధువులకు అందించారు. పాపకు వైద్య ఖర్చులతో పాటు ఇతర ఖర్చుల కింద 10200 రూపాయలను జారి రాయి సెంటర్ సార్ మేడి దౌలత్రావ్ చేతుల మీదుగా ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో జరీ రాయి సెంటర్ పరిధిలోని  గ్రామాల పటేళ్లు, ఆదివాసి పెద్దలు, అభిమన్యు వాట్సాప్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నట్లు ఆర్గనైజర్ మెస్రం శేఖర్ బాబు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పసిపాపల తల్లిదండ్రులు చనిపోయిన వెంటనే స్పందించి ఆర్థిక సాయం చేస్తున్న అభిమన్యు వాట్సాప్ గ్రూప్ సభ్యులను ఏజెన్సీ ప్రజలు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు