అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
27-09-2026 | 07:28pm
దామరచర్ల సెప్టెంబర్ 27: ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Bathula Lakshma Reddy) చెప్పారు. దామరచర్ల మండలం కొత్తపేట తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానని చెప్పారు.తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పించినందుకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.