విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా చెల్లోజు నవీన్ చారి
27-09-2026 | 07:45pm
జనగామ, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం(Viswabrahmana Journalists Association) జనగామ జిల్లా అధ్యక్షుడిగా చెల్లోజు నవీన్ చారి(Chelloju Naveen Chari) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మలూరు సత్యనారాయణ నియామక పత్రం అందజేశారు. నూతన కమిటీలో ప్రధాన కార్యదర్శిగా దిగోజు సాంబయ్య, కోశాధికారిగా సాతెల్లి రాజు, ఉపాధ్యక్షుడిగా వర్ధమాన్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.