సైబర్ నేరాలపై విద్యార్థులకుఅవగాహన కార్యక్రమం

27-10-2026 | 06:50pm

ఏటూర్ నాగారం ASP మనన్ బట్ IPS

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 27 (విజయక్రాంతి): వెంకటాపురం మండల కేంద్రంలో ఏటూరు నాగారం ASP మనన్ బట్(ASP Manan Bhatt) జిల్లా పరిషత్ హై స్కూల్, వెంకటాపురంని సందర్శించి అక్కడ విద్యార్థులతో మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ASP మనన్ బట్ IPS మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న సైబర్ నెలలపై విద్యార్థులు ఆన్లైన్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా డిజిటల్ భద్రతా ప్రమాణాలను తెలుసుకోవడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.

విద్యార్థులు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని గేమ్స్ ఆడేటప్పుడు, ఆన్లైన్ టాస్క్ పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లను, లాటరీలను నమ్మి మోసపోవద్దని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని తెలిపారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల సిఐ శ్రీ ముత్యం రమేష్ వెంకటపురం మండలఎస్సై కొప్పుల తిరుపతిరావు పోలీస్ స్టేషన్ సిబ్బంది‌. పాఠశాల , ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు