మనసుకు నచ్చి చేసిన సినిమా ఇది

12-09-2026 | 05:05am

ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటించిన చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’(Epic: First Semester). ఆదిత్య హాసన్ దర్శకత్వం(Directed by Aditya Hasan)లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Soujanya) నిర్మించారు. సెప్టెంబర్ 11 విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 10 రాత్రి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో మేకర్స్ శుక్రవారం ఏర్పాటుచేసిన థాంక్యూ మీట్‌(Thank-you meet)లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఇందులో ఉన్న కంటెంట్ చూసి, ఇది ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు. ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతున్నాయి.

ఇది నిజాయితీగా చేసిన సినిమా” అన్నారు. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “తెరపై తమను తాము చూసుకున్నట్టుందని ఎందరో నాకు మెసేజ్‌లు చేశారు. నా ఫ్రెండ్స్, కజిన్స్‌తో కలిసి నేను సినిమా చూశా. ఈ సినిమాలో అబ్బాయి నిజాయితీగా కేర్ చూపిస్తాడు, ప్రేమిస్తాడు. అది అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు బాగా నచ్చుతోంది” అని తెలిపింది.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “త్వరలో సీక్వెల్ ప్లాన్ చేస్తాం. కమర్షియల్ లెక్కలు వేసుకొని చేసిన సినిమా కాదిది, మనసుకి నచ్చి చేసింది” అని చెప్పారు. దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “సినిమాటిక్‌గా వెళ్లకుండా నిజాయితీగా, సహజంగా కథ చెప్పాలనుకున్నా. మా నమ్మకం నిజమైంది. నా దృష్టిలో హీరోయిజం అంటే అమ్మాయి కోసం ఫైట్ చేయడమే కాదు. అమ్మాయి కోసం క్యూట్ పనులు చేయడం కూడా. ఆ సహజత్వాన్నే ‘ఎపిక్’లో చూపించాం” అని తెలిపారు. 

మరిన్ని వార్తలు