పాడిరంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు
పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మధిర, కొడంగల్‌లో పాడి గేదెల పంపిణీ
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసి, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) తెలిపారు. శుక్రవారం శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో పాల ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందని, 2024 59.35 లక్షల టన్నులు, 2025 26లో 61.75 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైందన్నారు. 2026 ఆరు నెలల కా లానికి సుమారు 30 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేశామన్నా రు. ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి గేదె పాల కిలో వెన్నకు రూ.914, ఆవు పాల వెన్న, ఘ నపదార్థాల ప్రాతిపదికన రూ.340 ధర నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. పాడి రై తుల ఆదాయాన్ని పెంచే దిశగా మధిర, కొ డంగల్ నియోజకవర్గాల్లో సెర్ఫ్ భాగస్వామ్యంతో పాడి గేదెల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.
గోపాలమిత్రల సంక్షేమానికి మెడిక్లెయిమ్, వ్యక్తిగత ప్రమాద బీమా, సకాలంలో గౌరవ వేతనం, శిక్షణ, సాంకేతిక స హాయం, పర్యవేక్షణ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పశుసంవర్ధక శాఖ లో1100 మందికిపైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చామన్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల ను నిరోధించే ప్రతిపాదనలేవీ ప్రభుత్వం వ ద్ద లేవన్నారు. కర్ణాటకలోని నందిని డెయిరీ కంటే తెలంగాణలో విజయ డెయిరీ పాడి రైతులకు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నామని తెలిపారు. పాడి రైతుల ఆదాయాన్ని పెంచడం, పాల సేకరణ వ్యవస్థను, విజయ డెయిరీని బలోపేతం చేయనున్నట్లు మంత్రి వాకిటి పేర్కొన్నారు.