ప్యారడైజ్‌కు ట్రైలర్ ఉండదు!
* న్యాచురల్ స్టార్ నాని(Natural Star Nani) పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్(Pan-India period action entertainer) ‘ది ప్యారడైజ్(The Paradise)’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం(Directed by Srikanth Odela)లో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్(Songs, Glimpse, Teaser) మంచి స్పందన దక్కించుకొని, ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో నాని మాట్లాడుతూ.. “నా మొదటి సినిమాకు చాలా గొప్ప ఆదరణ ఉంది. ఇదే ప్రోత్సాహం కొనసాగుతుందని నమ్ముతున్నా. ‘ప్యారడైజ్’ చిత్రంలోని ఆయా షేర్, ఏష నాగుల కట్ట, గ్లింప్స్, టీజర్.. సినిమా నుంచి ఏ కంటెంట్ ఇచ్చినా అన్నిటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులు సినిమాను అంతగా సొంతం చేసుకున్నట్టు చూస్తుంటే మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఈ సినిమాకు ఒక డెస్టినీ ఉందనే బలమైన నమ్మకం వచ్చింది.
సెప్టెంబర్ 24న ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నాం. అందరూ చాలా అంచనాలతో థియేటర్‌కు వస్తారని తెలుసు. ప్రేక్షకులకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక అడ్రినలిన్ పంపింగ్, హై ఇచ్చి ఇంటికి పంపించాలనేది మా తపన” అన్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “సినిమా నుంచి ఏది వచ్చినా సరే ప్రేక్షకుల్లో బ్లాస్ట్ అవుతోంది. సాంగ్స్, టీజర్‌ను చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. నా సినిమా అనేకంటే ‘జనం సినిమా’ అనడం కరెక్ట్ అని అనిపిస్తోంది.
అంతలా ఈ కంటెంట్‌ను ఆదరించారు. ఇది రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం. ఒక తల్లి, కొడుకుల కథ. ఒక సవారీ జాతి కథ. పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది అని కాళోజీ మాట ఉంటుంది. ఆ దేశం కోసం కొట్లాడిన వారిని ఆ దేశంతోనే సంబంధం లేదు అంటే.. వాళ్లందరూ ఏం చేయాలో తెలియక, మరుగునపడ్డ జాతి కథ. ‘ది ప్యారడైజ్’ కథ ఏమిటో అవగాహన కోసం ఇది చెప్తున్నా. ఇంత సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్యూ” అని తెలిపారు.
* ఇదే సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు హీరో నాని సమాధానమిస్తూ.. “సినిమాలో నా జడల బరువు గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. వాటి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో అండర్ వాటర్ సీక్వెన్స్ లేదు. అలాగే వెయ్యి మందితో ఫైట్ కూడా లేదు. ఇదొక జెన్యూన్ కథ. చాలా యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. మంచి హై ఇచ్చే సీన్స్ ఉంటాయి. వైలెన్స్‌లో ఉన్న ఎమోషన్‌ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. -జడల గురించి మా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ ఏదో ఫ్లోలో మా టీమ్‌కి చెప్పినట్టున్నారు.
అదే వైరల్ అయింది. జడలతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ హెయిర్‌ను అటాచ్ చేస్తాం. అప్పుడు సహజంగానే బరువు ఉంటుంది. అది యాక్షన్ సన్నివేశాల్లో రోప్‌కి తాకి అందులో ఇరుక్కుపోయేవి. ఈ సినిమాలో జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇంతకుముందు నేనెప్పుడూ డాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. నా సినిమాల్లో డాన్సింగ్ సాంగ్స్ ఎక్కువ ఉండవు. అన్నీ సిచువేషన్ సాంగ్స్. ఇందులో రెండు డాన్స్ నంబర్స్‌ను ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
‘ఆయా షేర్’లో ఫ్లోర్ మూమెంట్ కోసం చాలా కష్టపడ్డా. పాటల విషయంలో శ్రీకాంత్‌కు చాలా మంచి టేస్ట్ ఉంది. సెలబ్రేషన్స్ పాటల ఎంపికలో మంచి అభిరుచి గలవాడు. ఈ రెండు పాటలు కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకొని చేయించాడు. ఇది తెలుగు సినిమా. ఇంతకుముందు చేసినట్టు అన్ని భాషల్లో సినిమాను అవైలబుల్గా పెట్టాలి. అలాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో, మిగతా భాషల వారికి కూడా అలాంటి అనుభూతే ఇవ్వాలని క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా చేశాం.
‘ప్యారడైజ్’ శ్రీకాంత్ విజన్‌తో పెద్ద స్కేల్లో థియేటర్లోకి వస్తుంది. సినిమాకు చాలా బజ్ ఉంది కదా అని ట్రైలర్ ఇవ్వలేకపోతున్నామనేది నిజం కాదు. సినిమా గురించి చాలా టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. అలాంటి ట్రైలర్ కావాలంటే నాలుగు రోజులు అన్ని పనులు పక్కనపెట్టి శ్రీకాంత్, అనిరుధ్, అందరూ ట్రైలర్ మీద పనిచేయాలి. కానీ మాకు టైమ్ లేదు. కాబట్టి ‘ప్యారడైజ్’కు ట్రైలర్ ఉండదు. తప్పనిసరి పరిస్థితిలో టీమ్ అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం.
కచ్చితంగా శ్రీకాంత్ మొండితనం వల్లే ఈ సినిమా ఆలస్యం అయింది. అతను మొండివాడు. కాకపోతే తన మొండితనానికీ ఒక కారణం ఉంది. తనకంటూ ఒక విజన్ ఉంది. ఆ విజన్‌ను స్క్రీన్‌పైకి తీసుకురావడానికి ఎక్కడ రాజీపడడు. తన మొండితనం మంచికే. ఈ సినిమాలో చాలా హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. సహజంగానే ఇలాంటివి చేస్తున్నప్పుడు గాయాలు అవుతాయి. ఈ సినిమాలో నాకే కాదు, మా గ్యాంగ్‌లో చేసిన అందరికీ దెబ్బలు తగిలాయి. యూఎస్ కాన్సర్ట్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఆ యుఫోరియా అనిరుధ్ వల్ల సాధ్యపడింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ‘ఆయా షేర్’ పాటకి వచ్చిన ఎనర్జీ నమ్మశక్యం కానిది. మోహన్‌బాబు అద్భుతమైన వ్యక్తి. మా మీద ఎంతో ప్రేమ చూపించారు. కలిసి పనిచేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం. టీజర్లో డైలాగ్స్ చాలా అగ్రెసివ్‌గా అనిపించాయట. ఈ క్యారెక్టర్‌కు అలానే మాట్లాడాలి. గొంతు చించుకుని అరుస్తున్న ఒక సీన్ ఉంటుంది. అందరికీ ఆ మాటలు అర్థం కావాలని లెక్కలేసుకుంటే ఆ పాత్ర కనిపించదు.
సినిమా చూస్తున్నప్పుడు తన ఎమోషన్లో ఉన్న ప్రతి పదం ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆ డబ్బింగ్ చెప్పిన తర్వాత నా గొంతు పోయింది. నా కెరీర్లో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘ప్యారడైజ్’. చాలా మనసుపెట్టి చేశాను. సినిమాలో కాకులకు సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే కాదు. సినిమా మొత్తం హైలైట్‌గా ఉంటుంది. ఇక విలేకరుల ప్రశ్నలకు డైరెక్టర్ శ్రీకాంత్ సమాధానాలిస్తూ “ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ పదాలు ఉన్నాయి.
సెన్సార్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. ఇందులో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ చూపిస్తే అందరూ కన్విన్స్ అవుతారు. రన్ టైమ్ రెండు గంటల 49 నిమిషాలు. అదే ఫైనల్ కట్” అని చెప్పారు. ‘ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువైందని అంటున్నారు. అయినా చాలా హ్యాపీగా ఉన్నా (నవ్వుతూ). ప్రీమియర్స్ ఉంటాయి. టికెట్ రేట్స్ హైక్స్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి” అని నిర్మాత సుధాకర్ చెప్పారు.