అదే అసలైన ప్రేమ!

30-09-2026 | 05:30am

తన పేరుకు తగ్గట్టు అందచందాల ప్రదర్శనతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా(Tollywood beauty Raashi Khanna). ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) ‘ధర్మన్’ సినిమా(Dharman movie) షూటింగ్‌లో పాల్గొంటోంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం రాశీఖన్నాకు అలవాటు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా అభిమాను లతో చిట్‌చాట్ నిర్వహించిందీ చిన్నది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపెన్‌గా సమాధానాలిచ్చింది.

“నాకు ఒంటరితనంగా అనిపించినప్పుడు ఆ భాధను ఎక్కడా దాచుకోకుండా పూర్తిగా అనుభవిస్తాను. దానివల్ల కళ్లలో నీళ్లు తిరిగితే తిరగనీస్తాను, ఆ భావాలను అణచివేయకుండా సహజంగా ప్రవహనిస్తాను. వాటితో అనవసరంగా పోరాడను. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనల నేను నేర్చుకున్న ఓ గొప్ప పాఠం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంటుంది. ప్రేమ అంటే ఎవరినీ కంట్రోల్ చేయడం కాదు, వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడమే. ప్రేమ ఎప్పుడైతే స్వచ్ఛమైన స్వేచ్ఛను ఇస్తుందో అదే అసలైన ప్రేమ అవుతుంది.

ఇవి కూడా చదవండి:  మేకింగ్‌లో సంతృప్తిపడేదాకా రాజీపడొద్దు

కేవలం మనం ప్రేమిస్తున్నామన్న ఒక్క కారణంతో అవతలి వాళ్లను మనతోనే ఉండాలని ఎప్పుడూ బలవంతం చేయకూడదు. అవతలి వ్యక్తులను వారి సొంత నిర్ణయం తీసుకోనివ్వాలి, అదే సమయంలో మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎదుగుతూనే ఉండాలి” అంటూ రాశీఖన్నా తన మన సులోని భావాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు