అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన బీజేపీ నాయకులు

29-09-2026 | 11:59pm

గండీడ్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండల పరిధిలోని పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు సందర్శించి పౌష్టికాహార పంపిణీని పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ రెడ్డి(Vijay Kumar Reddy) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొమరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, రుసుంపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, భోజన నాణ్యతను పరిశీలించారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. రుసుంపల్లి అంగన్‌వాడీ టీచర్ నిర్మల, ఆయా ఈశ్వరమ్మను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కె. రాజు, ఉపాధ్యక్షుడు భద్రేశ్వర్, బీజేవైఎం అధ్యక్షుడు చిట్యాల యాదగిరి, మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ గౌడ్, బూత్ అధ్యక్షులు శివకుమార్, మైపాల్, కృష్ణయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు