నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డి

30-09-2026 | 12:07am

సూర్యాపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(Ramreddy Sarvottam Reddy) పేరును ఏఐసీసీ ఖరారు చేసి ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు అభ్యర్థిత్వాన్ని ఆమోదించినట్లు ఎఐసిసి జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ పేరిట అధికారికంగా సమాచారం వెలువడింది. అయితే సర్వోత్తమ్ రెడ్డి మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు. కాగా వీరి కుటుంబానికి ఇటు ఉమ్మడి నల్లగొండ, అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి సంబంధాలు ఉండడం కలిసి వచ్చే అంశంగా భావించి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని వార్తలు