గుండె వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. అప్పయ్య
హనుమకొండ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వరల్డ్ హార్ట్ డే(World Heart Day) సందర్భంగా హనుమకొండలోని ఏకశిలా హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం, అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గుండె నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండి, రోజూ వాకింగ్, వ్యాయామం, యోగా చేయాలని ఏకశిలా ఎండీ డాక్టర్ రమేష్ సూచించారు.
కోవిడ్ తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయని, ప్రతి 3-6 నెలలకోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని కార్డియాలజిస్టులు తెలిపారు. ఈ శిబిరంలో 560 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏకశిలా డైరెక్టర్లు డా. సంధ్యారాణి, డా. ప్రవీణ్ రెడ్డి, మెడికల్ డైరెక్టర్ డా. ఆసిఫ్ ఇక్బాల్, కార్డియాలజిస్టులు, జనరల్ మేనేజర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.