మేకింగ్‌లో సంతృప్తిపడేదాకా రాజీపడొద్దు

29-09-2026 | 05:30am

యంగ్ హీరో శ్రీనందు(Young hero Srinandu) నటిస్తున్న కొత్త సినిమా ‘కాసు(Kaasu)’. ఇందులో ఇందు కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకేఆర్ డ్రీమ్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఇందు కుమార్, నరేంద్ర కొండ నిర్మిస్తున్నారు. పీఎస్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్ర మానికి టాలీవుడ్ నిర్మాత ఏఎం రత్నం అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సినిమా మేకింగ్‌లో మీరు సంతృప్తిచెందేవరకు రాజీ పడొద్దు. నా మొదటి సినిమా ‘కర్తవ్యం’ క్లైమాక్స్ షూట్ చేశాక నాకు సంతృప్తి కలగలేదు. మళ్లీ రైటర్స్‌ను పట్టుకుని క్లైమాక్స్ చేయించి, షూట్ చేశాం. ఆ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద విజయం సాధించింది. ‘7జీ బృందావన్ కాలనీ’ సినిమా గురించి నాకు ఇప్పటికీ ఫోన్లు వస్తుంటాయి. ఇప్పుడు దాని సీక్వెల్ చేస్తు న్నాం. ఏ సినిమా చేసినా మొదటి చిత్రంలా భావి ంచి నిర్మిస్తా. మీరూ అలాగే చేయాలని సలహా ఇస్తున్నా” అన్నారు.

ఇవి కూడా చదవండి: అదే అసలైన ప్రేమ!

హీరో శ్రీనందు మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో బిగ్ బడ్జెట్ మూవీ ఇది. డబ్బు మనకు కావాలి. అంతేకానీ మనం జబ్బు పడేంతగా డబ్బు కోసం ఆరాటపడొద్దు. డబ్బు జబ్బు కింద మారితే ఏమవుతుందనేదే ఈ సినిమా. వినోదం పంచుతూనే సైకలాజికల్‌గా ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. ఈ కథ విన్న తర్వాత నా దృక్పథంలోనూ మార్పులు వచ్చాయి. ప్రేక్షకులు కూడా అదే అనుభూతి పొందుతారనుకుంటున్నా” అని చెప్పారు. హీరోయిన్, ప్రొడ్యూసర్ ఇందు కుమార్ మాట్లాడుతూ.. “మా కాసు మూవీ ఎలా ఉంటుంది, ప్రేక్షకుల కాసులకు ఎంత న్యాయం చేస్తుందనేది ముందు ముందు అంతా తెలుసుకుంటారు.

మా కాసు నుంచి ఏ అప్డేట్ వచ్చినా సినీప్రియులను బాగా ఆకట్టుకుంటుంది” అని తెలిపింది. డైరెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. “హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఇది. కాసు మూవీ వరల్డ్‌లోకి అంతా వస్తారని నమ్ముతున్నాం” అని తెలిపారు. ‘ప్రేమలో ఉన్న ఒక జంట మధ్య దురాశ మొదలైతే ఆ బంధానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది మా సినిమాలో చూపించబోతున్నామ’ని నిర్మాత నరేంద్ర కొండ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి, ఎడిటర్ శ్రీనివాస్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు