సీఎం వ్యాఖ్యలపై గండీడ్‌లో బీజేపీ నిరసన
30-09-2026 | 12:02am
గండీడ్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హిందూ దేవుళ్లు, భక్తుల విశ్వాసాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గండీడ్ మండలంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మండల అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందూ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గిర్మోని శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు బద్రిశ్వర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రఘు, కోశాధికారి శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షుడు యాదగిరి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.