చౌటుప్పల్‌లో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

29-09-2026 | 11:37pm

చౌటుప్పల్, సెప్టెంబర్ 29: చౌటుప్పల్ మున్సిపాలిటీ వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా సుమారు రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా 9వ వార్డు అంజనా సాయి మేడోస్ కాలనీ, 14వ వార్డు రాజేంద్రనగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు మెరుగుపడితే ప్రజలకు రాకపోకలు, పారిశుద్ధ్య సమస్యలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు.

పట్టణంలోని అవసరమైన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్, ఆర్డిఓ శేఖర్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు