పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ

29-09-2026 | 11:44pm

ఏటూరునాగారం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో(ITDA Project Officer Lenin Vatsal Toppo) మంగళవారం రామంజాపూర్‌లోని ఏహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీఓ పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాలలో అందుతున్న బోధనా విధానం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రికార్డులు, అకాడమిక్ సంబంధిత వివరాలను కూడా పరిశీలించారు. 

విద్యార్థులు విద్యలో ముందుకు సాగేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పీఓ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సమస్యలు, అవసరాలపై సిబ్బందితో పీఓ వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, అవసరమైన సౌకర్యాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పీఓ ఆకస్మిక తనిఖీ సందర్భంగా పాఠశాల సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు