వాళ్ళని ట్రోల్ చేస్తే ఊరుకోను.. రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్!

21-11-2026 | 08:06pm

హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌ను పట్టించుకోనని, అయితే కుటుంబ సభ్యులు, స్నేహితులను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం సహించేది లేదని నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) స్పష్టం చేశారు. విమర్శలు తనను మరింత బలంగా మారుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

దర్శకుడు రవీంద్ర పుల్లె(Director Ravindra Pulle) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మైసా'(Mysaa Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న రష్మిక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌(Social Media Trolling)ను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నటిగా తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా భరించగలనని తెలిపారు. కానీ సినిమా రంగంతో సంబంధం లేని తన కుటుంబ సభ్యులు, స్నేహితులను ట్రోల్ చేయడాన్ని మాత్రం సహించనని స్పష్టం చేశారు.

ప్రతికూల వ్యాఖ్యలు ఎదురైనప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా తన పనిపై దృష్టి పెడతానని చెప్పారు. అవసరమైనప్పుడు వ్యాయామం చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటానని వెల్లడించారు. ట్రోలింగ్ తనను కుంగదీయడం లేదని, ప్రతీ విమర్శ తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందని రష్మిక చెప్పుకొచ్చారు. ఇక 'మైసా' విషయానికొస్తే.. రష్మిక ఇప్పటివరకు కనిపించని కొత్త యాక్షన్ అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు