వరమే నాకు దొరికెనులే..
సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందిన చిత్రం ‘మొహబ్బత్(Mohabbat)’. ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్నారు. మ్యాక్ దర్శకుడు. ఈశ్వర్ సాయి, మనోజ్, సాత్విక్, శ్రేయాస్ సేన్, సంతోష్ రాజా, అజయ్ ఘోష్, సంతోషి, దుర్గ కీలక పాత్రలను పోషించారు.
డిసెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ‘వరమే’ అంటూ సాగే యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ను మేకర్స్ డైరక్టర్ వీఐ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ‘వరమే నాకు దొరికెనులే.. యదలో కొత్త సంబరమే.. అడుగే నేల నడిచెనునలే.. మనసే చేరె అంబరమే..’ అంటూ సాగుతోందీ గీతం. సునీల్ కశ్యప్ బాణీ సమకూర్చిన ఈ పాటను భాష్య శ్రీ రాయగా, కృష్ణ తేజస్వి పాడారు. లిరికల్ వీడియోలో మొయిన్ కంపోజ్ చేసిన తీరు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్; కెమెరా: వైఎస్ కృష్ణ; ఎడిటింగ్ : శ్రీ వరప్రసాద్.