సాయి దుర్గ తేజ్ సరసన..?

11-11-2026 | 05:30am

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్(Mega Supreme Hero Sai Durgha Tej) మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను దర్శకత్వంలో ఆయన ఓ కొత్త సినిమా చేయబోతున్నారు. ఎస్‌డీటీ19 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటికే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. కన్నడ నటి, ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కాంబినేషన్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజా సినీ కథనాలు నిజమైతే సాయి దుర్గ తేజ్‌తో ఆమెకు ఇది తొలి సినిమా కానుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు మరో కీలక అవకాశం దక్కినట్లవుతుంది. ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుందని ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉండనుందని సమాచారం. సాయి దుర్గ తేజ్‌ను ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్‌లో చూపించాలనే ఉద్దేశంతో దర్శకుడు తేజ కాకుమాను ప్రత్యేకమైన కథను సిద్ధం చేసినట్లు చిత్ర ప్రకటనలో వెల్లడించారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ వంటి చిత్రాల్లో నటుడిగా గుర్తింపు పొందిన తేజ కాకుమానుకు ఇది ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా తొలి సినిమా. విభిన్నమైన కథలతో సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఆయన ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 15న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తొలుత వెల్లడించారు. మొత్తానికి సాయి దుర్గ తేజ్ కొత్త అవతార్, తేజ కాకుమాను దర్శకత్వ ప్రతిభ, అటవీ నేపథ్యంలోని యాక్షన్ అంశాలతో పాటు సప్తమి గౌడ హీరోయి న్‌గా నటించనుందనే ప్రచారం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి స్పష్టత రానుంది. 


మరిన్ని వార్తలు