ప్రభాస్ ఫ్యాన్స్‌కు నాగ్ అశ్విన్ అదిరిపోయే అప్‌డేట్!

25-09-2026 | 01:09pm

‘కల్కి 2898ఏడీ’ సీక్వెల్‌పై(Kalki 2898 AD Sequel) దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. మొదటి భాగంలో పరిచయమైన అదే ప్రపంచం, పాత్రలు కొనసాగుతాయని.. అయితే రెండో భాగంలో కథ మరింత లోతైన భావోద్వేగాలతో, భారీ స్థాయిలో ఉండబోతుందని తెలిపారు. కథను ఎలాంటి ముగింపుకు తీసుకెళ్తామనేదే సీక్వెల్‌లో కీలకంగా ఉంటుందని చెప్పారు. ఇక ‘కల్కి 2898ఏడీ’కి(Kalki 2898 AD 2) రెండు జాతీయ అవార్డులు రావడం చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చిందని నాగ్ అశ్విన్( Nag Ashwin) పేర్కొన్నారు. ప్రభాస్‌ లాంటి స్టార్‌ తన విజన్‌ను నమ్మి ప్రయాణించడం అదృష్టమని అన్నారు. నిర్మాత అశ్వనీదత్‌ కూడా జాతీయ స్థాయిలో సినిమాకు గుర్తింపు రావడం గర్వంగా ఉందని చెప్పారు. దీంతో ‘కల్కి 2’పై అంచనాలు మరింత పెరిగాయి.

మరిన్ని వార్తలు