పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి
మల్యాల,(విజయక్రాంతి): మల్యాల మండలంలో మండల అధ్యక్షులు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాజుల మల్లేశం మాట్లాడుతూ... దీన్‌దయాళ్ ఉపాధ్యాయ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసి, “ఏకాత్మ మానవతావాదం”, “అంత్యోదయ” సిద్ధాంతాలను సమాజానికి అందించారని కొనియాడారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్న ఆయన ఆశయాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల, జనధన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన వంటి పథకాల ద్వారా పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.
“సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ – సబ్ కా ప్రయాస్” అనే స్ఫూర్తితో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేయడమే దీన్‌దయాళ్ గారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 2047 నాటికి ఆత్మనిర్భర్, సమృద్ధ, సమర్థ, సంపన్న భారత్ నిర్మాణానికి ప్రతి బీజేపీ కార్యకర్త క్రమశిక్షణతో, నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి వెంకటస్వామి యాదవ్. మాజీ ఎంపిటిసి రాచర్ల రమేష్. బీజేవైఎం మండల అధ్యక్షుడు పొనుగంటి గౌతం. నులుగొండ సురేష్. జనగం రాములు. నక్కా ఆనందం. బండారి రాజు. షేర్ల పరుశురాం. గుండేటి గంగారం. గోపాల్. మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.