గ్లామర్ టు యాక్షన్!

12-09-2026 | 05:30am

టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌(Tollywood Golden Leg')గా పేరున్న బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon). ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వైవిధ్యభరితమైన కథాచిత్రాల(Storyboards)తో దూసుకుపోతోంది. కమర్షియల్ సక్సెస్‌(Commercial success)తోపాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ పాన్-ఇండియా(Pan-India) స్థాయిలో బిజీగా మారింది. మొత్తం మీద గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ‘స్లమ్ డాగ్(Slumdog)’, ‘ది బ్లాక్ గోల్డ్(The Black Gold)’, ‘హైందవ’ వంటి విభిన్న చిత్రాలతో సంయుక్తా మీనన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. వీటితోపాటు మరో కొత్త ప్రాజెక్టులోనూ భాగమైందీ భామ.

ఆ సినిమానే ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘రాపో23’. శుక్రవారం సంయుక్త పుట్టిన రోజు. ‘టాలీవుడ్ లక్కీ చార్మ్‌కు శుభాకాంక్షలు’ అంటూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా ఈ సినిమాలో భాగమైన విషయాన్ని అధికారికంగా వెల్లడించింది టీమ్. ఈ చిత్రంతో రామ్ పోతినేని దర్శకుడిగా తొలిసారి పరిచయమవుతూ దీన్ని నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.

రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, తిరునావుక్కరసు డీవోపీగా, పీటర్ హెయిన్, విక్రమ్ మోర్ స్టంట్స్ కొరియోగ్రాఫర్లుగా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సంయుక్త నటిస్తున్న ‘స్లమ్ డాగ్’, ‘ది బ్లాక్ గోల్డ్’, ‘హైందవ’  సినిమాల బృందాలు కూడా శుక్రవారం ఆమెకు బర్త్‌డే విషెస్ చెప్తూ ప్రత్యేక పోస్టర్లను పంచుకున్నాయి. 

మరిన్ని వార్తలు