చిన్నప్పుడు చూడనివ్వలేదు.. ఆ చిత్రాల్ని పెద్దయ్యాక ఎంజాయ్ చేశా!

28-11-2026 | 05:15am

నాగచైతన్య నటిస్తున్న కొత్త చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సర్ప్ శ్రీవాస్తవ్, జయ్‌రామ్, కియారా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపినీడు సమర్పకుడు. డిసెంబర్ 4న థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర విశేషాలనున హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది.  

నా కొత్త సినిమాలంటే.. కార్తీతో చేస్తున్న సినిమా నా పోర్షన్ 60 శాతం పూర్తయింది. హిందీ, తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నా. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. 

ఇక -డైరెక్టర్ కార్తిక్ ‘వృషకర్మ’ కథలో నాకు ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను డిజైన్ చేశారు. కథ చెప్తున్నప్పుడు కార్తీక్ ఈ పాత్రకు ఉండే లక్షణాలు చెప్పినప్పుడే, నన్ను ఎందుకు ఎంపిక చేశారనేది నాకు స్పష్టత వచ్చింది.  

చిన్నప్పుడు ఇంట్లో హారర్ సినిమాలు చూపించేవారు కాదు. ఎందుకంటే పీడకలలు వస్తాయని. కాకపోతే పెద్దయ్యాక అలాంటి సినిమాలను చాలా ఎంజాయ్ చేశా. నాకు హారర్, థ్రిల్లర్, డిటెక్టివ్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా అంగీకరించడానికి అది కూడా ఒక కారణం. హారర్, మిథికల్ జానర్‌లో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం చాలా ప్రత్యేకం. విజువలైజేషన్, ట్రీట్‌మెంట్ అద్భుతంగా ఉంటాయి. 

నాకు ఎత్తయిన ప్రదేశాలంటే చాలా భయం. ఇందులో అలాంటి సీక్వెన్సులున్నాయి. అవి చాలా ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఆ సందర్భాలు నాకు చాలా వినోదాత్మకమైన జ్ఞాపకాలను ఇచ్చాయి. ఆ సీక్వెన్సులన్నీ చాలా ధైర్యంగా చేశా. కొన్ని రఫ్ అండ్ టఫ్ సీన్లూ ఉన్నాయి. ఇంతకుముందు ఇంత భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమా నేను చేయలేదు. ఇది నాకు కొత్త అనుభూతినిచ్చింది. - 

ఇందులో నా పాత్ర పేరు దక్ష.. తన లక్ష్యాలపై దృష్టి సారించే తత్వం గల అమ్మాయి. తనకు కొన్ని లక్ష్యాలుంటాయి. తను ఆర్కియాలజీలో థీసెస్ చేస్తుంది. ఈ పాత్ర ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌కు చాలా మంచి గ్రాఫ్ ఉంది. నాగచైతన్యతో కలిసి రెండు రోజులు వర్క్‌షాప్ చేస్తున్నప్పుడు చాలా విషయాలపై రిహార్సల్స్ చేశాం. ఆర్కియాలజీ గురించి చాలా లోతైన విషయాలు నేర్చుకున్నా. 

మరిన్ని వార్తలు