రైల్వే బ్రిడ్జి సాధనకు కలసి కట్టుగా నడుద్దాం

29-10-2026 | 07:40pm

అఖిల పక్షం నాయకులు 

ఘట్ కేసర్, అక్టోబర్ 29 (విజయక్రాంతి) :  రాజకీయ పార్టీల(political parties) జెండాలను పక్కనపెట్టి రైల్వే బ్రిడ్జి సాధనకు కలసి కట్టుగా నడుద్దామని అఖిల పక్షం నాయకులు పిలుపు నిచ్చారు. ఘట్ కేసర్ శివారెడ్డిగూడ లోని బంధన్ ఫంక్షన్ హాల్ లో(Bandhan Function Hall) గురువారం ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు భూ బాధితులకు న్యాయం చేయాలని అఖిల పక్ష నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో  మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ లు అబ్బసాని యాదగిరి యాదవ్, సింగిరెడ్డి రాంరెడ్డి, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి, సిపిఎం, సిపిఐ నాయకులు చింతల యాదయ్య, కల్లూరి జయచంద్ర తదితర నాయకులు, మాట్లాడుతూ ఇన్నాళ్లు ఎంతోమంది  నాయకులకు, మంత్రులకు వినతిపత్రాలు అందించిన ప్రయోజనం లేదని,

ఇక పోరు బాట పట్టాల్సిందే అని తేల్చి చెప్పారు. కేసుల కోసం భయపడకుండా కార్యచరణతో బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయించడంతో పాటు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేకా ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది తేల్చుకోవాలని సూచించారు. సమావేశం స్థలం నుండి బైపాస్‌ చౌరస్తా వద్దకు ర్యాలీ గా వెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఆయన రాజకీయ పార్టీల నాయకులు సార శ్రీనివాస్ గౌడ్, కొంతం అంజిరెడ్డి, కొమ్మిడి మహిపాల్ రెడ్డి,  రేసు లక్ష్మారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, బేతాళ నర్సింగ్ రావ్, బండారి ఆంజనేయులు గౌడ్,  జహాంగీర్, నాయకులు పసులాది చంద్రశేఖర్, బర్ల రాధాకృష్ణ, కొత్తకొండ వెంకటేష్, నార్కట్ పల్లి సబిత, బాధితులు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు